కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు సవాల్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్‌ పార్టీ నేతల ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) స్పందిస్తూ సవాల్‌ విసిరారు. 300 ఎకరాల భూములు కబ్జా చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ కేసీఆర్‌, బీఆర్ఎస్ నేతలు ఈ కబ్జాకు పాల్పడ్డారని విచారణలో తేలితే తాము రాజీనామా చేస్తామని తేల్చి చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి, మంత్రులు కూడా సిద్ధమేనా అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఈ భూ ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు కాంగ్రెస్ నేతలు తోకముడిచారని ఈ సందర్భంగా విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పసలేని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>