గిరిజన హాస్టల్‌లో సౌకర్యాలపై కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆరా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ సమీపంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర కళాశాల వసతి గృహాన్ని కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని గదులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, సౌకర్యాలపై ఆరా తీశారు. నీళ్లు సరిగ్గా రావడం లేదని చెప్పడంతో.. నిరంతరం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు వసతి గృహాల్లో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. అనంతరం వార్డెన్ కార్యాలయంలోని రికార్డులు, హాజరు రిజిస్టర్, సీసీ టీవీ కెమెరాల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారితో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>