కలం, వెబ్ డెస్క్: తన ఎమ్మెల్యే పదవిపై హైకోర్టు అనర్హత వేటు వేయడంపై దానం నాగేందర్ స్పందించారు. తన అనర్హతపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను రెడీ అని.. ఎన్నికలకు సిద్ధమని తెలిపారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్తేమీ కాదని.. ఎన్నికల యుద్ధాలు చాలా చేశామని, యుద్ధంలో కచ్చితంగా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల మద్దతుతో పోరాడి విజయం సాధిస్తానని అన్నారు.
గతంలో స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, నాగేందర్ మాత్రం తన పోరాటాన్ని ప్రజాక్షేత్రానికే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు.

