కలం, కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు తరుచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ టూ డిపోలో సికింద్రాబాద్ వెళ్లేందుకు డిపోలో పార్క్ చేసి ఉన్న బస్సును డ్రైవర్ స్టార్ట్ చేసి టికెట్ మిషన్ కోసం వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బస్సులో నుంచి పొగలు రావడం (Electric Bus Fire) గమనించి అదికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో స్పందించిన అధికారులు మంటలను ఆర్పేశారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
కాగా, ఏడాది జులై 1న కరీంనగర్-2 డిపో బస్సు బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి దగ్ధమైంది. జూన్ 21న ఎలక్ట్రిక్ బస్సు హైదరాబాద్ వెళ్తుండగా అలుగునూరు దగ్గర అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.

