కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్ (Nirmal Collectorate) లోని సమావేశ మందిరంలో ప్రపంచపు తొలి వాస్తుశిల్పి, సృష్టికర్తగా పేరొందిన విశ్వకర్మ భగవానుడి జయంతి (Vishwakarma Jayanthi) వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి విశ్వకర్మ భగవానుడిని స్మరించుకున్నారు.
అనంతరం విశ్వకర్మ భగవానుడి గొప్పతనం, సమాజ నిర్మాణంలో విశ్వకర్మ వర్గాల పాత్ర, వారి నైపుణ్యం, వృత్తి ప్రాధాన్యతను పలువురు వివరించారు. విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రాకేష్, డీఆర్ఓ రాథోడ్ రమేష్, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, దయానంద్, డీపీఆర్ఓ విష్ణువర్ధన్, కౌన్సిలర్ శ్రీరామోజు నరేష్, వివిధ సంఘాల నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

