గంజాయి మత్తుకు చెక్‌.. పాన్‌ షాపుల్లో ఎస్పీ తనిఖీలు

కలం, నిర్మల్ : గంజాయి నిర్మూలనపై నిర్మల్ జిల్లా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లాలో గంజాయి సమస్యపై వివిధ వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Janaki Sharmila) సత్వరం స్పందించారు. గంజాయి అక్రమ విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ చర్యలకు ఆదేశించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎస్పీ స్వయంగా పాన్‌ టేలాల వద్ద తనిఖీలు చేపట్టారు.

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ తరఫున నిరంతర తనిఖీలు, నిఘా కొనసాగుతుందని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాల విషయంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ జానకి షర్మిల సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>