కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం (Bayyaram) మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు గర్భం దాల్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా ఐసీడీఎస్ అధికారులు.. ఆ బాలికలను రక్షణ కల్పిస్తూ సంరక్షణ కోసం ‘బాల రక్షక్ భవన్’ కు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఐసీడీఎస్ సూపర్వైజర్ కే.విజయ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రశాంత్ బాబు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు.

