యూపీఐ చార్జీలపై ఫైర్.. హనుమకొండలో సీపీఐ నిరసన

కలం, హనుమకొండ: యూపీఐ చెల్లింపులపై చార్జీల భారం మోపే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. బుధవారం హనుమకొండ కాళోజీ సెంటర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో యూపీఐ చార్జీలకు వ్యతిరేకంగా నిరసన (CPI Protest) చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధిస్తే సామాన్యులు, చిన్న వ్యాపారులపై భారం పడుతుందని అన్నారు. డిజిటల్‌ చెల్లింపులను ఉచితంగా కొనసాగించాలని.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, నాయకులు పాల్గొన్నారు.

Also Read : ఉద్యోగ సంఘాల జేఏసీతో ప్రభుత్వం కీలక భేటీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>