గుడ్‌‌న్యూస్.. ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు (NTR Bharosa Pension) దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు శుభవార్త అందించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 18వ తేదీ వరకు (మరో రెండు రోజులు) పొడిగించినట్లు సెర్ప్ (SERP) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 62 లక్షల మందికి ఎన్టీఆర్‌ భరోసా ద్వారా పింఛన్లు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ‘స్వర్ణ గ్రామాలు’, ‘స్వర్ణ వార్డు’ కేంద్రాల (గ్రామ/వార్డు సచివాలయాలు) ద్వారా ఈ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా అర్హులందరూ ముందే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>