రామగుండంలో అధికారుల తీరుపై కార్పొరేటర్ల నిరసన

కలం, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం (Ramagundam) మున్సిపల్ కార్పొరేషన్‌లో మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన డివిజన్ పరిధిలోని పెండింగ్ సమస్యలపై చర్చించేందుకు కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీని కలిసేందుకు వెళ్లిన 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్‌ను అటెండర్ ద్వారా బయటకు పంపించారనే ఆరోపణలు కలకలం రేపాయి. ప్రజాప్రతినిధి పట్ల అధికారులు వ్యవహరించిన తీరుపై తోటి కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా రాత్రి 8 గంటల సమయంలో కార్పొరేటర్లందరూ కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించి ధర్నాకు(Corporators Protest) దిగారు.

రాజకీయాలకు అతీతంగా ఏకమైన కార్పొరేటర్లు

ఈ నిరసనలో ప్రతిపక్ష కార్పొరేటర్లతో పాటు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు సైతం పాల్గొనడం మున్సిపల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్పొరేటర్‌కు గౌరవం ఇవ్వకుండా అటెండర్‌తో బయటకు పంపించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని నిరసనకారులు మండిపడ్డారు. అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని, కార్పొరేటర్ కౌటం సతీష్‌కు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, డివిజన్లలోని సమస్యల పరిష్కారానికి అధికారులు సహకరించాలని కార్పొరేటర్లు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>