UPI యూజర్స్‌కి బిగ్ అలర్ట్.. కొత్త నిబంధనలు అమలు..!

కలం, వెబ్ డెస్క్ : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ వినియోగదారులతో పాటు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ (UPI Payments) చేసేవారికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. రూ.2,000 లోపు లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండబోవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేసింది. వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు పూర్తిగా ఉచితమని ప్రకటించింది.

రూపే (RuPay) డెబిట్ కార్డ్ చెల్లింపులపై ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలు విధించరాదని ఆర్థిక శాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వ్యాపారులకు కస్టమర్లు చేసే చెల్లింపులప 0.4 శాతం ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. అలాగే, రూ.75 వేలు, ఆ పైన జరిగిన ట్రాన్సాక్షన్లకు గరిష్ఠంగా రూ.300 ఛార్జీ వర్తించనుంది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 15 వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు NPCI ప్రకటించింది.

Also Read : మహిళ కొంపముంచిన 80s ట్రెండ్.. 45 ఏళ్ల నాటి చోరీ గుట్టురట్టు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>