నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఘనంగా వినాయక పూజలు

కలం, నిజామాబాద్ బ్యూరో : వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్‌లో (Nizamabad Collectorate) ప్రతిష్ఠించిన గణనాథుడికి మంగళవారం అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ప్రసాదం స్వీకరించారు. వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు నిర్వహించగా.. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. దీంతో కలెక్టరేట్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ బాలరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌తో పాటు అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Also Read : కేసీఆర్ నివాసం వద్ద పసుపు నీళ్ల ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>