మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి

కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి ఆళ్ల నాని (Alla Nani) గుండెపోటుతో మరణించారు. విశాఖలోని సీతమ్మధారలో తన నివాసంలో తీవ్రమైన గుండెపోటుకు గురైన నాని మృతి చెందారు. జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని.. 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

ఆళ్ల నాని పూర్తి పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్. ఏలూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2013లో వైసీపీలో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. 2017లో ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2019లో తిరిగి ఏలూరు నుంచే ఎమ్మెల్యేగా గెలుపొంది జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

2024లో ఓడిపోవడంతో..

2019లో తిరిగి ఏలూరు నుంచే మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది 2019 నుంచి 2022 మధ్య కాలంలో జగన్ కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో.. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో 2025లో టీడీపీలో చేరారు. ఏలూరు జిల్లా రాజకీయాల్లో ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న ఆళ్ల నాని హఠాన్మరణంతో టీడీపీ, వైసీపీ నేతలు షాక్ అవుతున్నారు.

వాకింగ్ వెళ్లొచ్చాక..

కొన్ని నెలలుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆళ్ల నాని.. విశాఖలోని తన నివాసానికే పరిమితమవుతున్నారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆళ్ల నాని.. ఇంటికి తిరిగొచ్చి కుర్చీలో కూర్చుని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న క్రమంలో నాని గుండెనొప్పితో కిందపడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే కన్నుమూశారు. సాయంత్రానికి నాని పార్థీవదేహాన్ని ఏలూరు పట్టణానికి తీసుకురాబోతున్నారు. ఆళ్ల నానికి ఇద్దరు కుమారులు, అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం. వారు వచ్చాకే అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>