కలం, వెబ్ డెస్క్ : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం (Telangana Liberation Day) (హైదరాబాద్ ముక్తి దివస్) హైదరాబాద్‌లో జాతీయ స్ఫూర్తిని చాటుతూ మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక ‘తిరంగా బైక్ ర్యాలీ’ నిర్వహించారు. చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ర్యాలీని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాలతో నగర వీధుల్లో సందడి చేశారు.
ర్యాలీలో పాల్గొన్న మహిళలు సంప్రదాయ ‘భగవా పగిడి’ (కాషాయ తలపాగా) ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని బైక్‌లపై ముందుకు సాగుతూ దేశభక్తి నినాదాలతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మహిళా మోర్చా శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ర్యాలీకి మరింత వైభవం చేకూరింది.
పటేల్ విగ్రహం వరకు ర్యాలీ
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ (Bike Rally) ముఖద్వారం వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి స్వయంగా బైక్ నడుపుతూ మహిళా మోర్చా కార్యకర్తలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలతో కలిసి ముందుకు సాగుతూ జాతీయ ఐక్యత, దేశభక్తి సందేశాన్ని చాటారు.
ర్యాలీ ముగింపు సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యత కోసం పటేల్ చేసిన సేవలను స్మరించుకున్నారు. జాతీయ జెండాలతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, సంప్రదాయ వేషధారణతో ర్యాలీ సాగడం నగరంలో ప్రత్యేక దృశ్యంగా నిలిచింది.
జాకార్ల పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు
అంతక ముందు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోందని ఆరోపించారు. రజాకార్ల పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు, రక్తపు గుర్తులు కనిపిస్తాయని పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో విముక్తి కలిగిందని చెప్పుకొచ్చారు. నిజాం మెడలు వంచడంతో 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ గడ్డకు ముక్తి లభించిందని వెల్లడించారు. విమోచన చరిత్రను గత పాలకులు తొక్కిపెట్టారని విమర్శించారు.
Also Read : సుప్రీం కోర్టులో హైడ్రాకు భారీ షాక్
Follow Us On: X(Twitter)

