కలం, వెబ్ డెస్క్: ఎంతో సంబురంగా కొనుక్కున్న కొత్త ఫ్రిడ్జ్ ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. ఫ్రిడ్జ్ బాంబులా పేలిపోవడంతో (Refrigerator Blast) నలుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. బెళగావిలోని చమౌలి గల్లీలో శారద డమోలి, రాజారం కుటుంబం సోమవారం కొత్త ఫ్రిడ్జ్ కొనుగోలు చేసి, ఇంటికి తీసుకొచ్చారు.
రాత్రి అంతా నిద్రపోయాక ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలిపోయింది(Refrigerator Blast). ఈ ఘటనలో శారదతో పాటు ఆమె కుమార్తెలు ప్రియా, గంగ, మరో మహిళ సజీవ దహనం అయ్యారు. రాజారం, రోషన్ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి, ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : రూ.3,383 కోట్ల ఆస్తులు.. వీధుల్లో బిచ్చగాడిగా బీజేపీ ఎమ్మెల్యే!
Follow Us On: X(Twitter)

