హయత్‌నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పరిధి కుంట్లూర్ రాజీవ్ గృహకల్ప సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం (Hayathnagar Accident) చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు మెయిన్ రోడ్డు దాటుతుండగా, వేగంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టింది.

ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : పిల్లల డిజిటల్ భద్రతపై మెటా కీలక నిర్ణయం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>