విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం!

కలం, వెబ్ డెస్క్ : విజయవాడ (Vijayawada) కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవ్వడం కలకలం రేపింది. ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను పోలీసులు గుర్తించారు. నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో చేరుకున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అలీ అనే ప్రయాణికుడు, బస్సు దిగే సమయంలో తన బ్యాగ్ స్థానంలో మరొకరి బ్యాగ్ మారిపోయినట్లు గమనించాడు.

ఆ అనుమానాస్పద బ్యాగ్‌ను తెరచి చూడగా అందులో పేలుడు పదార్థాలు ఉండటాన్ని గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన కృష్ణలంక (Krishnalanka) పోలీసులు ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. బస్సులో ప్రయాణించిన ఇతర ప్రయాణికుల వివరాలు సేకరిస్తూ, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Also Read : రూ.3,383 కోట్ల ఆస్తులు.. వీధుల్లో బిచ్చగాడిగా బీజేపీ ఎమ్మెల్యే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>