కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. రాబోయే రెండు మూడు గంటల్లో యాదాద్రి భువనగిరి, హనుమకొండ, జనగామ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడబోతున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.
హైదరాబాద్ జలమయం..
అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సికింద్రాబాద్, నాగోల్, ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, కోఠి, అబిడ్స్, లక్డీకపూల్, నాంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, ఫిలిం నగర్, మాదాపూర్, మణికొండ, షేక్పేట్, మియాపూర్ ప్రాంతాల్లో జోరుగా వర్షం పడుతోంది.

