కలం, కరీంనగర్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ (Karimnagar Cooperative Urban Bank) సర్వసభ్య సమావేశం సరిపడ కోరం రానందున ఆదివారం జరగాల్సిన మీటింగ్ వాయిదా వేస్తున్నామని బ్యాంక్ సీఈవో శ్రీనివాసు తెలిపారు. వాయిదా పడ్డ సమావేశం జిల్లా సహకార అధికారి నిర్వహించాలని తిరిగి సెప్టెంబర్ 27వ తేదీన రెవిన్యూ గార్డెన్ లో తదుపరి సమావేశం నిర్వహించాల్సిందిగా కోరుతూ పీఐసీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, జిల్లా సహకార అధికారిని కోరుతూ లేఖ రాసినట్టు తెలిపారు. జిల్లా సహకార అధికారి తరపున హాజరైన వంశీకృష్ణకు లేఖను అందజేసినట్లు తెలిపారు.

