మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణ: హరీశ్ రావు

కలం, మెదక్ బ్యూరో: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలో అమర్నాథ్ అన్నదాత సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అమర్నాథ్ అన్నదాత సేవా సమితి ఏటా 10 వేల మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పార్వతీ దేవి కూడా నలుగు మట్టితోనే వినాయకుడిని తయారు చేసిందని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని గుర్తు చేశారు.

సొంత ఖర్చులతో నిర్మిస్తా..

రసాయనిక రంగులతో చేసే విగ్రహాలతో నీరు కలుషితమై, ఎంతో నష్టం జరుగుతోందన్నారు. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల దేవుడికి, ప్రకృతికి ఆనందంతో పాటు ప్రజలకు ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. ప్రతి ఊరిలో మట్టి వినాయకులనే ప్రతిష్టిస్తామని ముందుకు వస్తే.. సొంత ఖర్చులతో పర్మినెంట్ షెడ్డు నిర్మించి ఇస్తానని హరీశ్ రావు హామీ ఇచ్చారు. అనంతరం సమితి ప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొని మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>