ప్రజా పోరాటాల యోధుడు సీతారాం ఏచూరి: రాములు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: బహుముఖ ప్రజ్ఞాశాలి సీతారాం ఏచూరి అని, సిద్ధాంతాన్ని ఆచరణను జోడించి మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన గొప్ప మేధావి అంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రాములు (CPM Mahabubnagar) కొనియాడారు. శనివారం రోజు సీపీఎం జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రాములు మాట్లాడుతూ, సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐలో పనిచేసి జవహర్ లాల్ యూనివర్సిటీలో మూడుసార్లు ప్రెసిడెంట్ ‌గా ఎన్నికయ్యారని, ఎమర్జెన్సీలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని నిలదీసిన గొప్ప వ్యక్తి అని ఆయన అన్నారు. పార్లమెంటు రాజకీయాల్లోనూ, ప్రజా పోరాటాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారాని, సీపీఎం అఖిలభారత కార్యదర్శిగా ఉంటూ మరణించారని, ఆయన మరణం తీవ్ర లోటు అని తెలిపారు.

సీపీఎం రాష్ట్ర నాయకులు రాజు మాట్లాడుతూ, సీతారాం ఏచూరి ఒక వ్యక్తి కాదని.. సంస్థ అని, ఆయన సిద్ధాంత పటిమాతో ఇతర పార్టీల విధానాలను చెడుగుడులాడారని, మతోన్మాదానికి , కులతత్వానికి, వివక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారని ఆయన తెలిపారు. కష్టజీవుల విముక్తి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు . సీపీఎం సీనియర్ నాయకులు కిల్లే గోపాల్ మాట్లాడుతూ, సీతారాం ఏచూరి చెన్నైలో పుట్టి, హైదరాబాద్‌లో చదువుకొని , ఎమర్జెన్సీ కాలంలో ఢిల్లీ వెళ్లి జవహర్ లాల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ నిర్మాణంలోనూ కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు. సీతారాం ఏచూరి ఎస్ఎఫ్ఐ అఖిలభారత అధ్యక్ష కార్యదర్శులు గా పనిచేస్తూ సీపీఎం పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. సంతాప సభకు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లవెల్లి కురుమూర్తి అధ్యక్ష వహించారు. ఈ కార్యక్రమంలో పద్మ ,కడియాల మోహన్ ,చంద్రకాంత్, రాజ్ కుమార్, జగన్ వర్తగాలన్న దీప్లా నాయక్, వి కురుమూర్తి, ప్రశాంత్ , శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>