సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం: సీపీఎం

కలం, నిర్మల్ : సీపీఎం అగ్రనేత, మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని సీపీఎం (CPM) రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడుత రవిందర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతిని శనివారం నిర్వహించారు.

ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను మరింత ఉధృతం చేయడమే ఏచూరి ఆశయాలను కొనసాగించేందుకు నిజమైన మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్, బొమ్మెన సురేష్, జిల్లా కమిటీ సభ్యులు గంగామణి, లలిత, శైలేజ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>