కలం, వెబ్ డెస్క్ : భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌లో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కాసేపటి క్రితం భారత ప్రధాని మోదీ(Modi Xi Jinping)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సరిహద్దు వివాదం, వాణిజ్యం, బంధంలో భరోసా అంశాలపై ఇరువురి నేతల మధ్య చర్చలు కొనసాగినట్లు సమాచారం అందుతోంది.
ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రాతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇచ్చినందుకు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే భారత్ తో కీలక ఒప్పందాలు చేసుకుంటామని జిన్‌పింగ్ అన్నారు. భారత్, చైనా పరస్పరం సహకరించుకోవాలని కోరారు. కాగా, అంతకుముందు భారత్ ప్రతిపాధించిన ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్యదేశాలన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అంతర్జాతీయంగా ఉక్రెయిన్ యుద్ధం, గల్ఫ్ సంక్షోభం వంటి కీలక పరిణామాలు కొనసాగుతున్న వేళ యుద్ధాల కంటే చర్చలు, దౌత్యం ద్వారానే వివాదాలకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని బ్రిక్స్ దేశాలు స్పష్టం చేశాయి.

