కలం, స్పోర్ట్స్ : చెస్ బోర్డు ముందు కూర్చోవడమే కాదు.. పడుకుని కూడా ప్రత్యర్థులను దెబ్బకొట్టగలనని నిరూపించాడు 23 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ అలిరేజా ఫిరూజ్జా (Alireza Firouzja)!. మే నెలలో రొమేనియా వేదికగా జరిగిన టోర్నీలో కాలు మడతపడి తీవ్రంగా గాయపడ్డాడు. కనీసం నిలబడలేని పరిస్థితి ఉన్నా తగ్గలేదు. హోటల్ గదిలో మంచంపై పడుకుని, కాలి కింద దిండు పెట్టుకుని మరీ ప్రపంచ దిగ్గజాలతో మైండ్ గేమ్ ఆడాడు. పడుకుని ఆడటం నరకమనిపించినా.. ఆటపై ఉన్న పిచ్చి ముందడుగు వేయించింది. ఆ తర్వాత నార్వే టోర్నీ సమయానికి వాకర్ సాయంతో బోర్డు ముందుకు వచ్చాడు.
ప్రస్తుతం ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకుని, భారత గడ్డపై రచ్చ చేస్తున్నాడు. ఇటీవలే చెన్నై టైటిల్ కొట్టిన ఫిరూజ్జా (Alireza Firouzja).. ఇప్పుడు బెంగళూరులో జరుగుతున్న గ్లోబల్ చెస్ లీగ్‌లో దుమ్మురేపుతున్నాడు. భారత్‌లో చెస్‌కు ఉన్న క్రేజ్, ఇక్కడి తందూరీ చికెన్ రుచి తనను ఫిదా చేశాయని చెబుతున్నాడు. రాబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గుకేష్, సిందరోవ్‌ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుందని, నవంబర్‌లో జరిగే నెక్స్ట్ బిగ్ టోర్నీకి తానూ సిద్ధంగా ఉన్నానని హెచ్చరిస్తున్నాడు.
Also Read : బ్రిక్స్ అతిథులకు ఇండియన్ టేస్ట్స్
Follow Us On: X(Twitter)

