ఎంజీయూలో ఇంజనీరింగ్ విద్యార్థుల హ్యాకథాన్.. ఎప్పుడంటే?

కలం, ఎంజీ యూనివర్సిటీ: సెప్టెంబర్ 15న ఎంజీయూ (మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం) ఇంజనీరింగ్ కళాశాలలో ‘హ్యాకథాన్’ పోటీలు (MGU Hackathon) నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలు ఎదుర్కొంటున్న సాంకేతిక సవాళ్లకు విద్యార్థుల ద్వారా పరిష్కారాలు కనుగొనే లక్ష్యంతో పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా శుక్రవారం విశ్వవిద్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

ఈ పోటీల్లో ఎంజీయూ ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 40 కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విశ్వవిద్యాలయం తరఫున జాతీయ స్థాయి హ్యాకథాన్ పోటీలకు ప్రాతినిధ్యం వహించేలా ఎంపిక చేయనున్నారు. పోస్టర్ విడుదల అనంతరం వీసీ మాట్లాడుతూ.. సమస్యలను సవాళ్లుగా స్వీకరించి, వాటికి నూతన సాంకేతిక పరిష్కారాలు కనుగొనే ఔత్సాహికులకు ప్రపంచవ్యాప్తంగా అపార అవకాశాలు ఉన్నాయన్నారు.

విద్యార్థుల్లో పరిశోధన పట్ల జిజ్ఞాసను పెంపొందించడం ద్వారా స్వీయ అన్వేషణ, స్వతంత్ర ఆలోచనా ధోరణి అలవాడతాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరీష్ కుమార్, అధ్యాపకులు డాక్టర్ ఎం. జయంతి, డాక్టర్ కిరణ్ కుమార్, మారేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>