జీతాల కోసం గజ్వేల్ మార్కెట్ కార్మికుల ఆందోళన

కలం, మెదక్ బ్యూరో :  బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ (KCR) ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ (Gajwel) సమీకృత కూరగాయల మార్కెట్‌లో(Vegetable Market).. ప్రతిరోజూ మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచుతూ విధులు నిర్వహిస్తున్న కార్మికులకు గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా పనులను బంద్ చేసినా పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల వేళ కూడా మార్కెట్‌ను పూర్తిగా శుభ్రం చేస్తున్నా.. జీతాలు ఇవ్వడం లేదని, కార్మికుల జీతాల సమస్యను ప్రభుత్వం, మార్కెట్ అధికారులు తక్షణమే పరిష్కరించి, బకాయి జీతాలను చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేసారు.

మార్కెట్ కార్మికులు చేస్తున్న ఆందోళనను గజ్వేల్ –ప్రజ్ఞాపూర్ మున్సిపల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మద్దతు తెలిపారు. కార్మికుల శ్రమను గుర్తించి, వారికి రావాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలని మార్కెట్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. రెండు, మూడు రోజుల్లోగా కార్మికుల బకాయి జీతాలను చెల్లించకపోతే, కార్మికులతో కలిసి మార్కెట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మార్కెట్ యాజమాన్యాన్ని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>