పాస్‌బుక్ కోసం లంచం.. కటకటాల పాలైన తహసీల్దార్!

కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా కసిపేట మండలానికి చెందిన తహసీల్దార్ (Kasipet Tahsildar) అలుగునూరి రోషయ్య లంచం కేసులో దోషిగా తేలడంతో ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆయనకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కరీంనగర్‌లోని ప్రత్యేక న్యాయమూర్తి నామా సంతోష్ కుమార్ సెప్టెంబర్ 10, 2026న ఈ తీర్పును ప్రకటించారు.

జనవరి 9, 2013న ఫిర్యాదుదారునికి చెందిన వ్యవసాయ భూమిని రెవెన్యూ రికార్డులలో మ్యుటేషన్ చేసి, పట్టాదార్ పాస్‌బుక్ జారీ చేయడానికి తహసీల్దార్ అలుగునూరి రోషయ్య రూ.10వేలు లంచం తీసుకున్నారు.

ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో, అవినీతి నిరోధక చట్టం కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్ష రూ.5వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. అలాగే సెక్షన్ 13(1)(d), 13(2) కింద మరో రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధించారు. దీనికి కూడా జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష పడుతుందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>