మద్యం మత్తులో డ్రైవింగ్.. ఇద్దరికి గాయాలు

కలం, వెబ్ డెస్క్: బంజారాహిల్స్‌ (Banjara Hills)లో మద్యం మత్తులో కారు నడుపుతూ ఒక యువతి, యువకుడు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళలను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం, మద్యం మత్తులో ఓ యువతి, యువకుడు వోక్స్ వ్యాగన్ కారులో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లో అతి వేగంగా డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని ఆశా ఆసుపత్రి వద్ద రోడ్డుపై నడుచుకుంటున్న వెళ్తున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టారు.

ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడగా.. అందులో రంజనా రాయ్ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. కారు నడుపుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు నడిపిన యువతి, యువకుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>