కలం, నిర్మల్ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 90వ వార్షికోత్సవ మహాసభల వాల్ పోస్టర్ను నిర్మల్ (Nirmal) జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కైలాష్ (Kailash) మాట్లాడుతూ.. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో హనుమకొండ వేదికగా 90వ వార్షికోత్సవ మహాసభలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 90 ఏళ్లుగా విద్యార్థుల హక్కుల కోసం ఏఐఎస్ఎఫ్ పోరాడుతోందన్నారు.
విద్యార్థుల హక్కుల కోసం పోరాటం
సమగ్ర విద్యా విధానం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ, హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. మహాసభలకు నిర్మల్ జిల్లా నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హరీష్, కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.

