ట్రాక్టర్లతో అసెంబ్లీకి.. బీజేపీ వినూత్న నిరసన!

కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (MLA Payal Shankar) వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. పలువురు కార్యకర్తల ట్రాక్టర్లతో కలిసి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. గన్ పార్క్ వద్ద నిలిపేయడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదన్నారు. దీంతో రైతులకు విపత్తుల సమయంలో తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>