కలం, మక్తల్: మక్తల్ పట్టణంలోని నారాయణపేట రోడ్డులో గల ఎస్వీఎన్ లాడ్జిపై గురువారం సాయంత్రం మక్తల్ పోలీసులు ఆకస్మిక దాడులను (Makthal Police Raid) నిర్వహించారు. లాడ్జిలో గత కొంతకాలంగా వ్యభిచారంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో మక్తల్ ఎస్సై పి.రాజు ఆధ్వర్యంలో దాడులను నిర్వహించారు. పోలీసుల దాడిలో వ్యభిచారానికి పాల్పడుతున్న ఏడుగురు మహిళలు, ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే వీరితో పాటు లాడ్జి యజమాని భాస్కర్ రెడ్డి, అతని సహాయకులు ఉలిగెప్ప, నవాజ్ లపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పి.రాజు తెలిపారు. వీరి నుంచి పది సెల్ ఫోన్లు, రూ.7800 నగదు, రెండు బైకులు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మక్తల్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచామని, పౌరులు ఎవరైనా తమకు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

