కలం, బైంసా : బైంసా (Bhainsa) పట్టణంలోని మదీనా కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన 21 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని(Illegal Ration Rice) విజిలెన్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. షేక్ ఫారుక్ అనే వ్యక్తి మదీనా కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో విజిలెన్స్ అధికారులు ఇంటిపై దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 21 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

