కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ‘1980ల నాటి ట్రెండ్’ (80s AI Trend) పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫోటోలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసుకుంటున్న విమర్శలు కలకలం రేపుతున్నాయి. నేతల వ్యక్తిత్వ హననానికి తెరదీస్తూ ఇరు పార్టీలు చేస్తున్న పోస్టులపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీజేపీ తెలంగాణ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఉద్దేశిస్తూ, ఆమెను ఒక క్లబ్ డ్యాన్సర్‌గా చిత్రీకరిస్తూ ‘Circa-1970s’ క్యాప్షన్‌తో ఒక ఏఐ ఫోటోను పోస్ట్ చేశారు. దీనికి కౌంటర్‌గా తెలంగాణ కాంగ్రెస్ సైతం అంతే ఘాటుగా స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంటూ, రైల్వే స్టేషన్లో ప్రయాణికుల జేబులోంచి పర్స్ కొట్టేస్తున్నట్లుగా ఒక ఏఐ ఫోటోను సృష్టించి ‘Vadnagar Railway Station, 1970!’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది.
జాతీయ నాయకులను ఈ విధంగా దిగజార్చి చిత్రీకరించడంపై బీఆర్ఎస్ నేత జక్కిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘8 + 8 = ZERO FOR TELANGANA!’ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
ఒకరు సోనియా గాంధీని ‘బార్ డ్యాన్సర్’గా, మరొకరు ప్రధాని మోదీని ‘జేబుదొంగ’గా చూపించడాన్ని తప్పుపడుతూ.. ‘ఇది రాజకీయామా లేక దిగజారుడుతనంలో పోటీనా?’ అని ప్రశ్నించారు. పాలన, అభివృద్ధి, ప్రజాక్షేమాన్ని గాలికి వదిలేసి, 80ల నాటి సోషల్ మీడియా ట్రెండ్ (80s AI Trend) పేరుతో జాతీయ నేతలను అవమానించడానికి ఇరు పార్టీలు సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది, కాంగ్రెస్‌కు 8 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి చేసిందేమీ లేదని, ఈ సంఖ్య సున్నాకి సమానమని వ్యాఖ్యానించారు.
Also Read : 2027 వరల్డ్ కప్‌పై రోహిత్ షాకింగ్ కామెంట్
Follow Us On: X(Twitter)

