బీఆర్ఎస్ సభ్యులు బరితెగించి మాట్లాడారు.. సీఎం రేవంత్ ఆగ్రహం

కలం, వెబ్ డెస్క్: గత రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర రాజకీయ పరిణామాలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలకు నిరసన తెలిపేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్న సీఎం.. బీఆర్ఎస్ సభ్యులు బరితెగించి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సభ్యులు మాట్లాడిన మాటలను సభలో అన్ని పార్టీలు ఖండించాయని అన్నారు.

అసెంబ్లీ వంటి ప్రజాస్వామ్య దేవాలయం ముందు అధికారులపై దాడులు చేయడం, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ని, వారి తల్లిని అవమానించడం అత్యంత దురదృష్టకరమని సీఎం పేర్కొన్నారు. పార్లమెంట్, ముంబై, పుల్వామా దాడులకు స్పీకర్ పై మాటల దాడులకు ఏ మాత్రం తేడా లేదని విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యులను ఉన్మాదులుగా మార్చారని మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని, తల్లిని అవమానించడం ఎంత వరకు కరెక్ట్ అని సీఎం (Revanth Reddy) ప్రశ్నించారు.

Also Read : ఫామ్‌హౌస్‌ నుంచే అసెంబ్లీ కుట్ర: రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>