కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తనను శాసనమండలి నుంచి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్(Tata Madhusudan) స్పందించారు. తనతో పాటు నవీన్ కుమార్ రెడ్డికు శాసన మండలి ఛైర్మన్ అన్యాయం చేశారని భావిస్తున్నానని అన్నారు. ఏకపక్ష నిర్ణయంతో సస్పెన్షన్ దుర్మార్గం అని వెల్లడించారు.
సభ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో వివరణ కూడా చెప్పలేదని తాతా మధుసూదన్ (Tata Madhusudan) అన్నారు. తాను స్పీకర్‌ని ఉద్దేశించి ఎలాంటి దుర్భాషలు ఆడలేదని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో ఆయన కుటుంబంతో తనకు అనుబంధం ఉందని తెలిపారు. తాను స్పీకర్ తల్లి ని ఉద్దేశించి ఎలాంటి దుర్భాషలు లేదని, కులం కార్డుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఈ విషయంపై తమ అధినేత కేసీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలన్న తాతా మధుసూదన్.. రాజకీయాల్లో అనేకమార్లు దుర్భాషలాడిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని ఫైర్ అయ్యారు. క్షమాపణ చెప్పాల్సి వస్తే రేవంత్ రెడ్డి వందసార్లు చెప్పాలని అన్నారు.
Also Read : భారీ యంత్రాలు దించినా.. అంగుళం కదలని ఆంజనేయుడు
Follow Us On: X(Twitter)

