బైక్‌ పై గంజాయి అక్రమ రవాణా.. పోలీసులకు చిక్కిన ఇద్దరు కేడీలు!

కలం, ఖమ్మం బ్యూరో : ద్విచక్ర వాహనంపై అత్యంత రహస్యంగా గంజాయిని (Ganja)సరిహద్దులు దాటించేందుకు యత్నించిన కర్ణాటకకు (Karnataka)చెందిన ఇద్దరు కేడీల ఆటకు బూర్గంపాడు (Burgampadu) పోలీసులు చెక్ పెట్టారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో దాదాపు 18.30 కిలోల అక్రమ గంజాయితో (Ganja Seizure) పాటు ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

అక్రమంగా తరలిస్తున్న 18.30 కిలోల గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు ఎస్సై మేడా ప్రసాద్ (SI Meda Prasad) తెలిపిన వివరాల ప్రకారం.. అదనపు ఎస్సై నాగభిక్షం పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది మార్కెట్ యార్డు వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద అక్రమంగా తరలిస్తున్న 18.30 కిలోల గంజాయి బైక్‌పైనే దొరికింది.

స్మగ్లింగ్‌ వెనుక ఎవరున్నారు?

పట్టుబడిన నిందితులను కర్ణాటక రాష్ట్రం షాహపూర్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్, మధుగిరి తాలూకాకు చెందిన విజయ్ కుమార్‌గా పోలీసులు నిర్ధారించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న గంజాయితో పాటు అక్రమ రవాణాకు వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ గంజాయిని ఏ ప్రాంతం నుంచి కొనుగోలు చేశారు? ఎక్కడికి చేరవేసేందుకు తీసుకెళ్తున్నారు? ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>