వారికి దళితులను అవమానించడం ఫ్యాషన్‌గా మారింది: కాంగ్రెస్

కలం, నిర్మల్: అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ (Gaddam Prasad Kumar) పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhu) అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన (Congress Protest) చేపట్టారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడిన తాతా మధుపై చర్యలు తీసుకుని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులను తప్పించుకుని కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకులకు దళితులను అవమానించడం ఒక ఫ్యాషన్‌గా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. వెంటనే కేసీఆర్ స్పీకర్‌‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>