కలం, వెబ్ డెస్క్: ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ (KCR Farmhouse) వద్ద హై టెన్షన్ నెలకొంది. ఫాంహౌస్ ముట్టడికి పలు దళిత సంఘాలు పిలుపునివ్వడంతో.. కేసీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ఎర్రవల్లికి చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి మర్కూక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ జోలికి వస్తే.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
ఫాం హౌస్ రోడ్లు మూసివేత..
కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడి హెచ్చరికల నేపథ్యంలో గజ్వేల్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులను భారీగా రప్పించి బందోబస్త్ ఏర్పాటు చేశారు. సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఎవరూ రావడానికి వీల్లేదని ఏసీపీ తెలిపారు. గజ్వేల్ నుంచి ఎర్రవల్లికి వెళ్లే రోడ్లను పూర్తిగా మూసివేశారు.

