కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు (Tata Madhu), నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట ఎమ్మెల్సీ తాతా మధును నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై సోమవారం ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
మంగళవారం ఉదయమే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు.. మధును (Tata Madhu) అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకునేందుకు ఆయన అనుచరులు ప్రయత్నించారు. తాతా మధును నాంపల్లి కోర్టులో హాజరు పర్చబోతున్నారు. కోర్ట్ రిమాండ్ విధిస్తే ఆయన్ను జైలుకు తరలించే అవకాశం ఉంది.
మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కూడా..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి (MLC Naveen Kumar Reddy)ని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కోకాపేటలోని ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు.. అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా.. పోలీసులు వినిపించుకోలేదు. సోమవారం అసెంబ్లీ వద్ద పోలీసులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది.
Also Read : నేడు సభకు బీఆర్ఎస్.. మహిళా ఎమ్మెల్యేల అంశాన్ని ప్రస్తావించే ప్లాన్
Follow Us On: X(Twitter)

