కలం, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాల తొలి రోజు అరెస్టులు, నిరసనలతోనే ముగిసినందున మంగళవారం సభకు హాజరుకావాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నది. నిరసన సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన అంశాన్ని ప్రస్తావించాలని అనుకుంటున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు కామెంట్లను కాంగ్రెస్ హైలైట్ చేసి అనర్హత వేటు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో ఆయన చేత బహిరంగ క్షమాపణ చెప్పించింది.
ఈ అంశానికి కొనసాగింపుగా మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను ప్రస్తావించాలనుకుంటున్నది. మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించడం, మరో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మెడపట్టి పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని లేవనెత్తాలని భావిస్తున్నది. దీనిపై సభా వేదికగానే చర్చించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనుకుంటున్నది.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

