కార్మిక సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి: సీఐటీయూ డిమాండ్

కలం, నిర్మల్: రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా (Nirmal CITU) కార్యదర్శి బొమ్మెన సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆయన ఆదివారం హాజరై మాట్లాడారు. స్కీం వర్కర్లు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, పీఎఫ్‌, ఈఎస్ఐ, పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. బీడీ కార్మికులకు పెన్షన్ పెంపు, ప్రభుత్వ ఉద్యోగులకు CPS రద్దు చేసి OPS అమలు, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పి. గంగామణి పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>