ఆగి ఉన్న కారును ఢీకొట్టిన లారీ.. ఎనిమిది మంది విద్యార్థులు మృతి!

క‌లం, వెబ్‌డెస్క్: కేర‌ళ‌లోని త్రిసూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Thrissur Accident) జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో త‌మిళ‌నాడుకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాల్లోకి వెళ్తే.. దిండిగ‌ల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు శుక్ర‌వారం రాత్రి కారులో ప్ర‌యాణిస్తున్నారు. మార్గ‌మ‌ధ్య‌లో కైప‌మంగ‌ళం స‌మీపంలోని పానంభిక్కున్ను వ‌ద్ద జాతీయ‌ ర‌హ‌దారి ప‌క్క‌న‌ కారు ఆపి కారులో కూర్చొని ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ఓ లారీ వేగంగా వ‌చ్చి వీరి కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

వెంట‌నే స్థానికులు భారీ ఎత్తున ప్ర‌మాదం జ‌రిగిన చోటుకు చేరుకున్నారు. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృత‌దేహాల‌ను వెలికి తీశారు. కారు త‌మిళ‌నాడు రిజిస్ట్రేష‌న్ క‌లిగి ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాల‌ను త్రిసూర్ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల మార్చురీకి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు చేస్తున్నారు. మృతుల‌కు సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read : మినిస్టర్ క్వార్టర్స్‌లోకి కాంగ్రెస్ బాస్.. టీపీసీసీ చీఫ్ సీక్రెట్ మూవ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>