మినిస్టర్ క్వార్టర్స్‌లోకి కాంగ్రెస్ బాస్.. టీపీసీసీ చీఫ్ సీక్రెట్ మూవ్!

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ (Mahesh Kumar Goud)కు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో అధికారిక నివాసం కేటాయించారు. మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని క్వార్టర్‌ నంబర్‌ 15ను ఆయనకు కేటాయించినట్లు సమాచారం.

పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌కు అధికారిక నివాసం కేటాయించడంతో ఆయన త్వరలోనే ఈ క్వార్టర్‌లోకి మారే అవకాశం ఉంది. ప్రస్తుతం క్వార్టర్‌లో అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నేడు ఉదయం పూజ కు ఏర్పాట్లు

క్వార్టర్‌ నంబర్‌ 15లోకి ప్రవేశించే ముందు శనివారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాల సమాచారం. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పూజ నిర్వహించి అనంతరం అధికారిక నివాసాన్ని వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడంతో పాటు ప్రభుత్వానికి, పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయం కొనసాగిస్తున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌(Mahesh Kumar Goud)కు మినిస్టర్‌ క్వార్టర్స్‌లో నివాసం కేటాయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, ప్రజా వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయనకు అధికారిక నివాసం అందుబాటులోకి రావడంతో పార్టీ పరమైన కార్యకలాపాలకు మరింత సౌలభ్యం కలగనుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగే పార్టీ సమావేశాలు, నేతలతో భేటీలు, వివిధ కార్యక్రమాల సమన్వయానికి ఈ నివాసం కేంద్రంగా మారే అవకాశం ఉంది.

క్వార్టర్‌ నంబర్‌ 15లో ఉదయం పూజ అనంతరం మహేష్‌కుమార్‌ గౌడ్‌ అధికారికంగా నివాసాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : కేబినెట్ రేసులో ‘ఆది’.. బీసీ కార్డు ఫలించేనా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>