కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైంది: జాజుల

కలం, వెబ్ డెస్క్: బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించడం దారుణమని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) ధ్వజమెత్తారు. గతంలో బీసీ మంత్రులను తొలగించిన ప్రభుత్వాలకు పట్టిన గతే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టబోతుందన్నారు. మంత్రి తన శాఖలో అవినీతికి పాల్పడితే, పదవిని సరిగ్గా నిర్వహించకపోతే బర్తరఫ్ చేస్తుంటారని కానీ, కొండా సురేఖ అంశంలో అదేం లేదన్నారు. కేవలం రాజకీయ వ్యాఖ్యల కారణంగా మంత్రి పదవి నుంచి తీసేయడం ఎప్పుడూ జరగలేదన్నారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖకు బాధ్యత ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.

అలా చేస్తే రేవంత్ సీఎం అయ్యేవారా..?

రాజకీయపరమైన అంశాలను రాజకీయంగానే చూడాలి తప్ప, పదవులు పీకేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్సీ వర్గానికి చెందిన తాటికొండ రాజయ్య, బీసీ బిడ్డ ఈటల రాజేందర్ ను ఇలాగే తీసేస్తే.. కేసీఆర్ అధికారం కోల్పోయారని గుర్తు చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీలు 60 శాతం ఉంటే మంత్రులు మాత్రం ముగ్గురే ఉన్నారని వివరించారు. వారిలో ఒకరిని ఇప్పుడు తొలగించారని, ఇక మంత్రి వర్గంలో బీసీలకు ప్రాధాన్యం ఎక్కడుందున్నారు. దీనిపై మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>