రేవూరి ప్రకాశ్ రెడ్డిపై కొండా సురేఖ ఇంట్రస్టింగ్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన తర్వాత కొండా సురేఖ (Konda Surekha) మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆమె ఆరోపణలు చేశారు. తనను క్యాబినెట్ నుంచి తొలగించడానికి అసలు కారణం సీఎం రేవంత్‌రెడ్డేనని అని మండిపడ్డారు. పరకాల పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి (Revuri Prakash Reddy) పేరును ప్రకటించడంతోనే ఈ వివాదం మొదలైందని కొండా సురేఖ గుర్తుచేశారు. పార్టీ నియమాలను పక్కనబెట్టి ఓ నియోజకవర్గ అభ్యర్థిని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి మళ్లీ బరిలో దిగితే పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని కొండా సురేఖ (Konda Surekha) విమర్శించారు. ఆయనకు కనీసం సరిగ్గా నడిచే ఓపిక కూడా లేదని, అలాంటి వ్యక్తి ఎలా గెలుస్తారని సెటైర్లు వేశారు.

Also Read : కొండా సురేఖ అస్త్రంపై.. రేవంత్ రెడ్డి బ్రహ్మాస్త్రం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>