వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

కలం, జడ్చర్ల : స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని జడ్చర్ల మున్సిపాలిటీలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Jadcherla MLA Anirudh Reddy) పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>