పదోన్నతితో మరింత బాధ్యత : ఎస్పీ శ్రీనివాసరావు

కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ శాఖలో కోదండాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై వి.శ్రీనివాసులు గౌడ్ ఎస్సైగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు (Gadwal SP Srinivasa Rao) ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ శంకర్‌తో కలిసి పదోన్నతి పొందిన శ్రీనివాసులు గౌడ్‌కు ఎస్సై హోదా స్టార్ తొడిగి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పదోన్నతి అనేది కేవలం పదవి పెరగడం మాత్రమే కాదని, ప్రజలకు మరింత బాధ్యతతో సేవలు అందించే అవకాశం అని అన్నారు. ఇప్పటివరకు చూపిన నిబద్ధత, క్రమశిక్షణతో పాటు పదోన్నతి అనంతరం మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను అర్థం చేసుకుని సత్వర పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.

పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టడం ప్రతి పోలీసు అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటూ సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. పదోన్నతి కొత్త హోదాను మాత్రమే కాకుండా, మరింత బాధ్యతను తీసుకువస్తుందనే విషయాన్ని గుర్తుంచుకుని, ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>