రాంచందర్ రావు హౌస్ అరెస్ట్ దుర్మార్గం: సాయిని మల్లేశం

కలం, కరీంనగర్: నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డిని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని పార్టీ జిల్లా (BJP Karimnagar) అధ్యక్షుడు సాయిని మల్లేశం తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను ఎండగడుతూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

కాంగ్రెస్‌పై ఫైర్..

ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీకి రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే అధికార పార్టీ నేతలు అరాచకాలకు దిగుతున్నారని విమర్శించారు. నల్లగొండలో బీజేపీ జిల్లా అధ్యక్షుడి కుటుంబ సభ్యులపై, ఆయన తల్లిపై భౌతిక దాడులకు తెగబడిన కాంగ్రెస్ గూండాలను వదిలేసి బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న రాష్ట్ర అధ్యక్షుడిని గృహనిర్బంధం చేయడం తీవ్ర దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన అరాచక పాలన సాగుతోందని, శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉధృతమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అక్రమ అరెస్టులకు బీజేపీ భయపడదని, ప్రభుత్వ నిరంకుశ విధానాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

నిరసనలో పాల్గొన్న నాయకులు..

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి సంపత్ రావు, గుజ్జ శ్రీనివాస్ రావు, వైద రామానుజమ్, నాంపల్లి శ్రీనివాస్, సిహెచ్ నరసింహ రాజు, కనుమల్ల గణపతి, దండు కొమరయ్య, పుప్పాల రఘు, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరెడ్ల ప్రవీణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సంగా నరేష్, బోయిని శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే కార్పొరేటర్లు తోట అనిల్, కోడూరి చంద్ర, పొన్నం మొండయ్య, ఏన్నం ప్రకాష్, గాజె శివరాం, మండల/జోన్ అధ్యక్షులు బండారి గాయత్రి, తనుకు సాయికృష్ణ, పాదం శివరాజ్, అవుదుర్తి శ్రీనివాస్, జాడి బాలరెడ్డి, కంది రాజిరెడ్డి, చింతం శ్రీనివాస్, బింగి వేణు, కుంట తిరుపతి, తిప్పర్తి నికేష్, అడిచెర్ల రాజు, కాడర్ల విమల్ కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు పర్వేజ్, ముత్యాల జగన్ రెడ్డి, కచ్చకాయల రాజులతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>