కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమావేశం అయ్యారు. మంగళవారం ఢిల్లీకి వెళ్లిన రేవంత్, కేసీ వేణుగోపాల్ తో కీలక అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తెలంగాణలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరు, పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో గత కొద్ది రోజులుగా నడుస్తున్న మంత్రి కొండా సురేఖ(Konda Surekha), చిన్నారెడ్డి (Chinnareddy) ఎపిసోడ్‌కు సంబంధించిన పరిణామాలపైనా కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి మధ్య కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ అంశాలపై పార్టీ అధిష్ఠానం వైఖరి, నేతల మధ్య సమన్వయం, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Also Read : కేసీఆర్ చెప్పినా కవిత వినలేదు: ప్రశాంత్ రెడ్డి
Follow Us On: Instagram

