జిల్లాలో 322 బూత్‌లపై బీజేపీ నిఘా!

కలం, వనపర్తి: జిల్లాలో (Wanaparthy SIR) ఎస్‌ఐఆర్ రెండో దశ ప్రక్రియపై బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ జిల్లా కన్వీనర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ ప్రత్యేక కార్యశాలలో ఆయన మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గంలోని 322 బూత్‌లలో ఓటర్ల జాబితాను కార్యకర్తలు క్షుణ్ణంగా పరిశీలించాలని నారాయణ సూచించారు. ఈఆర్‌ఓల నుంచి నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి, తమ పేర్లు తుది ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలని కోరారు.

ఎంట్రీలను గుర్తించాలి..

ఓటర్ల జాబితాలో డబుల్ ఓట్లు, తప్పుడు వివరాలతో నమోదైన ఎంట్రీలను గుర్తించాలని, అర్హత కలిగిన నూతన ఓటర్లను ఫారం–6 ద్వారా నమోదు చేసుకునేలా సహకరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించడంతో పాటు, అనర్హులు లేదా తప్పుడు నమోదులను గుర్తించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సబి రెడ్డి, వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేతూరి బుడ్డన్న, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది విజయభాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, ఉపాధ్యక్షులు శివారెడ్డి, బాబురావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గంధం ప్రవీణ్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్, కౌన్సిలర్ విజయ్ సాగర్, చిత్తారి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి మణి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>